Wife Harassment : రోజుకు 5వేలు ఇస్తేనే కాపురం చేస్తానంటోంది..!- భార్యపై పోలీసులకు భర్త ఫిర్యాదు

చెప్పినట్లు చేయకపోయినా, అడిగినంత డబ్బు ఇవ్వకపోయినా వేధింపులకు గురి చేస్తోందని.. బలవన్మరణానికి పాల్పడతానని బెదిరిస్తోందని..

Wife Harassment : రోజుకు 5వేలు ఇస్తేనే కాపురం చేస్తానంటోంది..!- భార్యపై పోలీసులకు భర్త ఫిర్యాదు

Updated On : March 20, 2025 / 11:18 PM IST

Wife Harassment : బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు. నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది, కాపాడండి అంటూ పోలీసులను వేడుకున్నాడు. తన ఫిర్యాదులో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్ అయ్యారు. నా భార్య ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటుంది, డబ్బులు డిమాండ్ చేస్తుంది, అడిగినంత ఇవ్వకపోతే బలవన్మరణానికి పాల్పడతానని బెదిరిస్తోందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అంతకు మించిన ట్విస్ట్ ఏంటంటే.. కాసులు ఇస్తేనే సంపారం చేస్తానంటోంది. రోజుకు 5వేల రూపాయలు ఇస్తేనే నాతో కాపురం చేస్తానంటోందని ఆ భర్త వాపోయాడు.

Also Read : అమ్మ బాబోయ్.. జేబులో పేలిన మొబైల్ ఫోన్.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్‌కు తీవ్ర గాయాలు.. ఎందుకిలా పేలిపోతున్నాయి..

అతడి పేరు శ్రీకాంత్. సాఫ్ట్ వేర్ ఇంజినీర్. వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ లో భార్యపై ఫిర్యాదు చేశాడు. 2022లో తనకు పెళ్లైందని శ్రీకాంత్ తెలిపాడు. పెళ్లైనప్పటి నుంచి తన భార్య తనను టార్డర్ పెడుతోందని శ్రీకాంత్ వాపోయాడు. తన భార్య తనను వర్క్ ఫ్రమ్ హోం చేసుకోనివ్వడం లేదన్నాడు. జూమ్ కాల్ మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డ్యాన్స్ చేస్తోందని చెప్పాడు. చెప్పినట్లు చేయకపోయినా, అడిగినంత డబ్బు ఇవ్వకపోయినా వేధింపులకు గురి చేస్తోందన్నాడు. ఇవన్నీ భరించలేక విడాకులు కోరితే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని ఆ భర్త కన్నీటిపర్యంతం అయ్యాడు.

భర్త శ్రీకాంత్ వెర్షన్ ఇలా ఉంటే.. భార్య వెర్షన్ మరోలా ఉంది. తన భర్త తనపై చేసిన ఆరోపణలను ఆమె కొట్టిపారేసింది. అందులో నిజం లేదని చెప్పింది. మరో పెళ్లి చేసుకోవడం కోసమే తన భర్త తనపై లేనిపోని నిందలు వేస్తున్నాడని ఆరోపించింది. ఆడియోలు, వీడియోలు ఎడిట్ చేసి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని ఆమె ఆరోపించింది.