Burned Woman On Highway : భార్యకు నిప్పు పెట్టిన భర్త… హైవేపై పడేసి పరార్

ఉత్తర‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం జలౌన్ జిల్లా ఒరై ప్రాంతంలోని అజ్నార్ జాతీయ రహదారిపై కాలిన గాయాలతో ఉన్న మహిళ(23)ను స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Burned Woman On Highway : భార్యకు నిప్పు పెట్టిన భర్త… హైవేపై పడేసి పరార్

Burned Woman On Highway

Updated On : July 7, 2021 / 5:53 PM IST

Burned Woman On Highway : ఉత్తర‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం జలౌన్ జిల్లా ఒరై ప్రాంతంలోని అజ్నార్ జాతీయ రహదారిపై కాలిన గాయాలతో పడిఉన్న మహిళ(23)ను స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు ఆమెను వెంటనే ఝూన్సీ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు అందించిన సమచారం ప్రకారం ఝూన్సీ జిల్లా పూంఛ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సెసా గ్రామానికి చెందిన ఉమ అనే యువతి(23), ఒరై లోని బజారియాలో నివసిస్తున్న ఆరిఫ్ అనే వ్యక్తిని మూడు నెలల క్రితం మతాంతర వివాహాం చేసుకుంది. భర్తే తనను సజీవదహనం చేసేందుకు నిప్పంటించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కోంది.

మహిళ పరిస్ధితి విషమంగా ఉన్నందున మరిన్ని వివరాలు చెప్పలేక పోయిందని… భర్తే తనకు నిప్పు అంటించాడని తెలిపిందని ఏఎస్పీ రాకేష్ సింగ్ చెప్పారు. ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.