CRPF Jawan : డబ్బు కోసం.. నిశ్చితార్ధం ఒకరితో… పెళ్లి మరోకరితో

కట్నం ఎక్కువిచ్చారని అంతుకు ముందు నిశ్చితార్ధం చేసుకున్న సంబంధం కాదని మరోక మహిళ మెడలో తాళికట్టిన సీఆర్పీఎఫ్ జవాను ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

CRPF Jawan : డబ్బు కోసం.. నిశ్చితార్ధం ఒకరితో… పెళ్లి మరోకరితో

Woman Complaint Of Crpf

Updated On : April 17, 2021 / 1:27 PM IST

Woman Filed a case against CRPF Jawan : కట్నం ఎక్కువిచ్చారని అంతుకు ముందు నిశ్చితార్ధం చేసుకున్న సంబంధం కాదని మరోక మహిళ మెడలో తాళికట్టిన సీఆర్పీఎఫ్ జవాను ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

శిరివెళ్ల మండలం గుంప్రమానుదిన్నె గ్రామానికి చెందిన మధు భాస్కర్ సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. పెళ్లి చేసుకునే క్రమంలో తిమ్మాపురం గ్రామానికిచెందిన ఓ యువతితో జనవరి 16వ తేదీన నిశ్చితార్ధం చేసుకున్నాడు.

అయితే మధుభాస్కర్ ఈనెల 15 వ తేదీన బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. సమాచారం తెలుసుకుని ఇంతకు ముందు నిశ్చితార్ధం చేసుకున్న వధువు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే … ఎక్కువ కట్నం ఇచ్చారనిసమాధానం చెప్పాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.