Leopard Attack : చిరుతపులి దాడిలో మహిళ మృతి

పశువులకు మేత తీసుకువచ్చేందుకు అడవికి వెళ్లిన ఓ మహిళపై చిరుతపులి దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్‌లోని సుఖిధాంగ్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళను చిరుతపులి చంపింది....

Leopard Attack : చిరుతపులి దాడిలో మహిళ మృతి

Leopard Attack In Uttarakhand

Updated On : July 3, 2023 / 6:18 AM IST

Leopard Attack : పశువులకు మేత తీసుకువచ్చేందుకు అడవికి వెళ్లిన ఓ మహిళపై చిరుతపులి దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్‌లోని సుఖిధాంగ్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళను చిరుతపులి చంపింది. ఈ సంఘటన ధురా గ్రామంలో జరిగిందని, మృతురాలు చంద్రావతిగా గుర్తించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. (Woman Mauled To Death) పశువులకు మేత కోసం అడవికి వెళుతున్న కొందరు మహిళలపై చిరుతపులి దాడి చేసింది. ( Leopard In Uttarakhand)

BCCI Announces Women’s Squad : బంగ్లాదేశ్ సిరీస్‌కు భారత మహిళల జట్టు… బీసీసీఐ ప్రకటన

చిరుత చంద్రావతిని ఈడ్చుకెళ్లిందని, మిగతా మహిళలు తప్పించుకుని గ్రామస్థులకు సమాచారం అందించారని అటవీశాఖ అధికారి తెలిపారు. అడవిలో చంద్రావతి కోసం అటవీశాఖ అధికారులు వెతకగా, ఆమె మృతదేహం అడవికి సమీపంలో కనిపించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

Ramachandra Rao KVP : త్వరలోనే కాంగ్రెస్‌లోకి షర్మిల, చంద్రబాబుతో పొత్తు వల్ల నష్టపోయాం- కేవీపీ

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. చంద్రావతికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని అధికారి తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తరచూ అడవిలో చిరుతపులులు దాడులు చేస్తూనే ఉన్నాయి. గతంలో పలువురు చిరుతల దాడిలో గాయపడ్డారు.