Narmada Canal: ముగ్గురు పిల్లల్ని కెనాల్లో విసిరేసి.. ప్రియుడితో కలిసి అదే కెనాల్లో దూకిన మహిళ
గురువారం ఉదయం గ్రామ ప్రజలు నర్మద కాలువ వెంట నడుస్తుండగా.. ఒడ్డుపై సెల్ఫోన్లు కనిపించాయని, కాలువలో ఇద్దరు చిన్నారుల మృతదేశాలు తేలియాడుతూ కనిపించినట్లు నాకు చెప్పారు. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాను. ఫైర్ టీం, గజ ఈతగాళ్లకు కూడా విషయం చేరవేశాను. ఒక సెల్‌ఫోన్ అదే పనిగా రింగ్ అవుతుంటే ఎత్తి మాట్లాడాను.

Woman Throws Her Three Children Then Jumps in Narmada Canal With Her Lover
Narmada Canal: ప్రియుడితో జీవితాన్ని పంచుకుందామని తన ముగ్గురు పిల్లలతో ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చి.. అది సాధ్యం కాదని తెలిసి, తమకు ఇక చావే శరణ్యమనకుంది ఓ మహిళ. అంతే తన ముగ్గురు పిల్లలను నర్మద కాలువలో విసిరేసి ప్రియుడితో పాటు తాను అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్‌లోని బంక్సంత జిల్లా తరడ్ తాలూలో ఉన్న చందర్ అనే గ్రామంలో బుధవారం జరిగిందీ దారుణం.
చందర్ గ్రామ సర్పంచ్ మఫాజీ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘గురువారం ఉదయం గ్రామ ప్రజలు నర్మద కాలువ వెంట నడుస్తుండగా.. ఒడ్డుపై సెల్ఫోన్లు కనిపించాయని, కాలువలో ఇద్దరు చిన్నారుల మృతదేశాలు తేలియాడుతూ కనిపించినట్లు నాకు చెప్పారు. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాను. ఫైర్ టీం, గజ ఈతగాళ్లకు కూడా విషయం చేరవేశాను. ఒక సెల్‌ఫోన్ అదే పనిగా రింగ్ అవుతుంటే ఎత్తి మాట్లాడాను. మహిళ పేరు ముక్తాబెన్ ఠాకూర్ అని తెలిసింది. ఫోన్ కాల్ ద్వారా వారి లొకేషన్ చూడగా వావ్ తాలూకలోని దేథలి గ్రామం అని వచ్చింది’’ అని అన్నారు.
2002 Gujarat riots case: తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం
కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ముక్తబెన్ మామ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ముక్తాబెన్కి ఈశ్వర్బాయి అనే వ్యక్తితో 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఈశ్వర్బాయి గాంధీనగర్‌లో కూలీ పని చేస్తుంటాడు. అయితే ఈ మధ్యే వారు సొంత ఊరికి మారారు. అనంతరం అక్కడ ఒక యువకుడితో ముక్తాబెన్కి శారీరక సంబంధం ఏర్పడింది’’ అని తెలిపాడు.
ఈ క్రమంలో బయటికి ఎక్కడికైనా వెళ్లి కలిసి బతుకుదామనుకుని ఇద్దరూ అనుకుని ఊరి నుంచి పారిపోయి వచ్చారు. ముక్తాబెన్ తన ముగ్గురు పిల్లల్ని కూడా వెంట తెచ్చుకుంది. కానీ, కలిసి బతకడం కుదరనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సర్పండ్ మఫాజీ పటేల్ తెలిపారు. గురువారం సాయంత్రానికి మూడో చిన్నారి మృతదేహం లభించిందని, అయితే మహిళ, యువకుడి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదని, వారి కోసం ఇంకా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.