హత్యా? ఆత్మహత్యా?: దగ్గరలోనే డిస్కోరాజా షూటింగ్

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య హైదరాబాద్ పట్టన నగరశివార్లలోని శంషాబాద్‌లో మరో మహిళ చనిపోయిన ఘటన సంచలనం అయ్యింది. ఎవరో గుర్తుతెలియని మహిళని సిద్దులగుట్ట ప్రాంతంలోని బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో తగులబెట్టినట్లుగా తెలిసింది. అయితే మహిళ ఆత్మహత్య చేసుకుందనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది.
బంగారు మైసమ్మ ఆలయం వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలంలో కిరోసిన్ డబ్బా దొరకడంతో ఇది హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ మహిళను అరగంట క్రితమే మంటల్లో కాలిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మహిళ మృతదేహం 60శాతం కాలిపోవడంతో 108లో మృతదేహాన్నిఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కో రాజా షూటింగ్ జరుగుతుండడంతో అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నట్లే తెలుస్తుంది. అయితే యువతి మంటల్లో కాలుతున్న సమయంలోనే కొందరు అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన మహిళ వివరాలు తెలియరాలేదు. యువతిని హత్య చేశారా? లేకుంటే ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.