Karnataka : డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించుకోబోయి రైలు కిందపడి వ్యక్తి మృతి
మద్యం తాగుతూ కారు నడుపుతున్న వ్యక్తి పోలీసులు డ్రంక్ & డ్రైవ్ నిర్వహిస్తున్నారని చూశాడు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో కారు దిగి పక్కనే ఉన్న రైలు పట్టాలపై పరిగెత్తాడు.

Drunk And Drive Karnataka
Karnataka : కర్ణాటకలో విషాద ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగుతూ కారు నడుపుతున్న వ్యక్తి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని చూశాడు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో కారు దిగి పక్కనే ఉన్న రైలు పట్టాలపై పరిగెత్తాడు. అదే సమయంలో వచ్చిన రైలు ఢీ కొట్టటంతో అక్కడి కక్కడే మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే… బెంగుళూరు సుంకదకట్టే నివాసి దిలీప్(28) తన స్నేహితులు మరో ఆరుగురితో కలిసి కారులో మద్యం సేవిస్తూ మైసూరుకు వెళుతున్నారు. మార్గం మధ్యలో బసవనపుర వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు చేస్తున్నారు.
Also Read : AP Corona Bulletin Report : ఏపీలో తగ్గిన కరోనా.. 3వేల 556 టెస్టులు చేస్తే 8 కేసులే నమోదు
అప్పటికే మద్యం సేవించిన దిలీప్ పోలీసులు పట్టుకుంటారనే భయంతో కారు దిగి రోడ్డు పక్కేన ఉన్నరైలు పట్టాల పైకి పరిగెత్తాడు. అదే సమయంలో ఆ ట్రాక్ మీదకు రైలు రావటంతో దాని కిందపడి మరణించాడు. ఈక్రమంలో కారులోని ఒక వ్యక్తి పరారయ్యాడు. మిగిలిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.