అడవిలో గోనెసంచిలో యువతి మృతదేహం, పీక్కుతిన్న కుక్కలు.. వికారాబాద్ జిల్లాలో దారుణం

  • Published By: naveen ,Published On : October 3, 2020 / 12:50 PM IST
అడవిలో గోనెసంచిలో యువతి మృతదేహం, పీక్కుతిన్న కుక్కలు.. వికారాబాద్ జిల్లాలో దారుణం

Updated On : October 3, 2020 / 12:50 PM IST

young woman dead body in bag: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోటపల్లి అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం లభ్యమైంది. గోనె సంచిలో కట్టివేసి పాతి పెట్టిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఎవరు? ఆమెను ఎవరు చంపారనే కోణంలో ఆరా తీస్తున్నారు.