Chain Snatching : కానిస్టేబుల్ మెడలో గొలుసు కొట్టేసిన కిలాడీ లేడీ

రోడ్డు మీద ఒంటరిగా ఉండి లిఫ్ట్ అడిగింది కదా... ఆడపిల్ల ...పోనీ పాపం అని లిఫ్టు ఇస్తే మెడలో బంగారు గొలుసు కాజేసిందో కిలాడీ లేడీ. పైగా అదీ కానిస్టేబుల్ మెడలోంచి.

Chain Snatching : కానిస్టేబుల్ మెడలో గొలుసు కొట్టేసిన కిలాడీ లేడీ

Chain Snatching In Constable Neck

Updated On : November 16, 2021 / 11:31 AM IST

Chain Snatching :  రోడ్డు మీద ఒంటరిగా ఉండి లిఫ్ట్ అడిగింది కదా… ఆడపిల్ల …పోనీ పాపం అని లిఫ్టు ఇస్తే మెడలో బంగారు గొలుసు కాజేసిందో కిలాడీ లేడీ. పైగా అదీ కానిస్టేబుల్ మెడలోంచి.

హైదరాబాద్ లో  కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి   బైక్ పై   రోడ్డు మీద వెళుతున్నాడు. రోడ్డు మీద ఒంటరిగా ఉన్న ఒక యువతి లిఫ్ట్ అడిగింది. పోన్లే పాపం ఆడపిల్ల అని మానవత్వంతో లిఫ్టు ఇచ్చాడు. పంజాగుట్ట సెంటర్ దగ్గర దిగిపోయింది.  కానిస్టేబుల్ ముందుకు వెళ్లిపోయాడు.

కొంత దూరం వెళ్లాక, ఎందుకో ఒకసారి మెడ చూసుకుని షాక్ కు   గురయ్యాడు. తన మెడలో ఉండాల్సిన బంగారు గొలుసు మాయం అయ్యింది. తాను లిఫ్ట్ ఇచ్చిన యువతే గొలుసు దొంగిలించిదని నిర్ధారించుకున్నాడు. వెంటనే వెనక్కు వచ్చి పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.