Youtuber Jyoti Malhotra: హర్యానాలో ఐఎస్ఐ ఏజెంట్..! యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ టూర్ ఫొటోలు, వీడియోలు వైరల్..
ట్రావెల్ వ్లాగర్ ముసుగులో జ్యోతి పాక్ కు అనుకూలంగా పని చేసిందని.. తన ఛానెల్ 'ట్రావెల్ విత్ JO' ద్వారా పాకిస్తాన్ సానుకూల ఇమేజ్‌ను ప్రచారం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.

Youtuber Jyoti Malhotra: గూఢచర్యం కేసులో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఉంటూ ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా పని చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ కోసం పని చేసిందని, భారత్ కు చెందిన కీలక సున్నితమైన సమాచారాన్ని పాక్ కు చేరవేసిందన్న అభియోగాలు ఆమెపై ఉన్నాయి. దీంతో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా, ట్రావెల్ వ్లాగర్ గా గుర్తింపు పొందిన జ్యోతి.. పాకిస్థాన్ లో పర్యటించింది. అక్కడి ప్రదేశాలను వీడియోలు తీసి అప్ లోడ్ చేసింది. తన యూట్యూబ్ చానల్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వాటిని అప్ లోడ్ చేసింది. గతంలో పాకిస్తాన్ టూర్ లో ఆమె తీసుకున్న ఫోటోలు, తీసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
జ్యోతి వయసు 33ఏళ్లు. హర్యానాలోని హిసార్ నివాసి. 2011లో Travel with jo పేరుతో యూట్యూబ్ చానల్ లాంచ్ చేసింది. ఆమె యూట్యూబ్ ఛానల్ కు 3.77 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్ స్టా అకౌంట్ కు 1.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన యూట్యూబ్ చానల్ లో 500లకు పైగా వీడియోలు ఉన్నాయి. 53 లక్షల వ్యూస్ ఉన్నాయి. తనను తాను సాంప్రదాయ దృక్పథం ఉన్న ఆధునిక అమ్మాయిగా జ్యోతి చెప్పుకుంటుంది.
View this post on Instagram
తన చానెల్ లో ట్రావెల్ కు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేసేది జ్యోతి. భారత్ తో పాటు పాకిస్తాన్‌లోని అనేక గమ్యస్థానాల ప్రయాణానికి సంబంధించిన వీడియోలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది జ్యోతి. మార్చిలో పోస్ట్ చేసిన యూట్యూబ్ షార్ట్ లో తన పాకిస్తాన్ ప్రయాణాన్ని వివరించింది జ్యోతి. అక్కడికి హిందూ తీర్థయాత్రలను సందర్శించడానికి వెళ్లానని అందులో తెలిపింది.
View this post on Instagram
ట్రావెల్ వ్లాగర్ ముసుగులో జ్యోతి పాక్ కు అనుకూలంగా పని చేసిందని.. తన ఛానెల్ ‘ట్రావెల్ విత్ JO’ ద్వారా పాకిస్తాన్ సానుకూల ఇమేజ్‌ను ప్రచారం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.