జీరో ఎఫ్ఐఆర్ తో 3 కేసులు : ఒక కేసులో నిందితుడు అరెస్టు

దిశ హత్యాచారం ఘటన తర్వాత ప్రజలకు జీరో ఎఫ్ఐఆర్ పై అవగాహన పెరుగుతోంది. తాజాగా వరంగల్ , వికారాబాద్ జిల్లా పరిగి, వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఒక్కొక్క కేసు నమోదు అయ్యింది. నేరం ఎక్కడ జరిగినా అనువుగా ఉన్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసుకునే సౌకర్యాన్ని పోలీస్ శాఖ జీరో ఎఫ్ఐఆర్ ద్వారా కల్పిస్తోంది. ఇప్పుడు వరంగల్, వికారాబాద్ లలో నమోదైన కేసుల్లో ఒక కేసు నిందితుడిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. మరోక రెండు కేసులు సంబంధింత పీఎస్ కు రిఫర్ చేశారు.
పరిగి పోలీసు స్టేషన్ పరిధిలో పరిగికి చెందిన తస్లీమా బేగం అనే మహిళ తన కుమార్తెను మోసం చేశాడని, వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి కిచెందిన బేగిరదాసుపై పిర్యాదు చేసింది. పరిగి పోలీసులు ఆ కేసును వికారాబాద్ పీఎస్ కు తరలించారు. వికారాబాద్ డీఎస్పీ నేతృత్వంలో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి శుక్రవారం డిసెంబర్ 6న రిమాండ్ కు తరలించారు.
మరోక కేసులో…తాండూరు ప్రాంతానికి చెందిన కవిత అనే మహిళను కొడంగల్ మండలం పెద్ద నందిగామకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా కలిసి మోసం చేయడంతో వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఈకేసులో రాజశేఖర్‌తో పాటు తండ్రి రామకృష్టయ్య, చెల్లి వసంత, బావ శ్రీనివా్‌సలపై చీటింగ్‌తో పాటు రేప్ కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. ఈకేసును పోలీసులు కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేశారు. రాజశేఖర్ కాచిగూడలో ఉంటూ కవితను అక్కడే ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఈ కేసును పోలీసులు కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వరంగల్ జిల్లా సుబేదారీ పోలీసు స్టేషన్ లో 24 ఏళ్ల యువతి మిస్సింగ్‌పై ఫిర్యాదు వచ్చింది. శాయంపేట నియోజకవర్గానికి పరిధి గోవిందాపూర్‌కు చెందిన యువతి అదృశ్యంపై సుబేదారి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యువతి చిన్నాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాన్ని సంబంధింత శాయంపేట పోలీసు స్టేషన్ కు తరలించారు. సుబేదారి పోలీస్ స్టేషన్‌లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.