నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : 311 ప్రభుత్వ పోస్టులు భర్తీ

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో పలు విభాగాల్లో 311 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ఈ

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 03:16 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : 311 ప్రభుత్వ పోస్టులు భర్తీ

Updated On : May 28, 2020 / 3:43 PM IST

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో పలు విభాగాల్లో 311 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ఈ

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో పలు విభాగాల్లో 311 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ఈ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందుకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో పంచాయితీరాజ్ శాఖలో ఈ కొత్త పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ  త్వరలోనే ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పోస్టులన్నీ గెజిటెడ్ హోదావి. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపిన రోజు నుంచి ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.

పోస్టుల వివరాలు:
* చీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-23
* డిప్యూటీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-23
* జిల్లా పంచాయతీ అధికారులు-23
* డివిజనల్ పంచాయతీ అధికారి పోస్టులు- 40
* మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో)-101
* మండల పంచాయతీ అధికారులు-101

Also Read : సచివాలయ పరీక్షల అభ్యర్థులకు ముఖ్య గమనిక