AIATSL Recruitment : ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.

AIATSL Recruitment : ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

AIATSL Recruitment :

Updated On : January 16, 2023 / 5:21 PM IST

AIATSL Recruitment : ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 హ్యాండీమ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్‌కు గరిష్ట వయోపరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 28 సంవత్సరాలుగా నిర్ణయించారు.

ఈ పోస్టులకు ఎంపిక కావడానికి అభ్యర్థులు ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, పీఈటీ మరియు స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.aiasl.in పరిశీలించగలరు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 20 జనవరి 2023గా నిర్ణయించారు.