AP Mega DSC 2025: అలెర్ట్.. ఏపీ డీఎస్సీ కొత్త హాల్ టికెట్ల విడుదల ఇవాళే.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది . వాయిదా పడిన డీఎస్సీ 2025 పరీక్షలను జూలై 1, 2 తేదీల్లో జరుపనున్నట్లు తెలిపింది. కొత్త హాల్ టికెట్లను ఇవాళ(జూన్ 25) విడుదల చేయనున్నారు.

Ap Mega DSC 2025 new hall tickets releasing today
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ 2025 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు ముగిశాయి. మిగతాయి జరగాల్సి ఉంది. ఇవి జూన్ 20, 21వ తేదీల్లో జరగాల్సింది కానీ, యోగ డే కారణంగా పరీక్షలను వాయిదా వేశారు. దీనిపై తాజాగా విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది . వాయిదా పడిన పరీక్షలను జూలై 1, 2 తేదీల్లో జరుపనున్నట్లు తెలిపింది. దీనికి సంబందించిన కొత్త హాల్ టికెట్లను ఇవాళ(జూన్ 25) విడుదల చేయనున్నారు విద్యాశాఖ అధికారులు. ఈమేరకు కొత్త హాల్ టికెట్లను https://apdsc.apcfss.in అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి కృష్ణారెడ్డి ప్రకటన చేశారు.
ఇక మంగళవారం(జూన్ 24) ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ జరిగింది. మూడు సెషన్లలో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 59,889 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 49,593 మంది హాజరయ్యారని సమాచారం. ఇక ఏపీ డీఎస్సీ పరీక్షలకు సంబంధించి పలు పరీక్షలు ప్రాథమిక కీలతో పాటు రెస్పాన్స్ షీట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా అధికారులుల్ మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధం అవ్వగా 5,77,417 అప్లికేషన్లు అందాయి.