AP PGCET 25: ఏపీ పీజీసెట్‌ కు సర్వం సిద్ధం.. రేపటినుంచే పరీక్షలు

అధికారులు ఏపీ పీజీసెట్ పరీక్షల కోసం మొత్తం 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

AP PGCET 25: ఏపీ పీజీసెట్‌ కు సర్వం సిద్ధం.. రేపటినుంచే పరీక్షలు

AP PGCET 2025

Updated On : June 8, 2025 / 3:07 PM IST

ఏపీ పీజీ సెట్‌-2025 పరీక్షల కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపట్నుంచి(జూన్ 09) నుంచి ఈ పరీక్షలుల ప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 25 వేలకుపైగా అభ్యర్థులు ఈ పరీక్షల కోసం అప్లికేషన్ చేసుకున్నారు.

అధికారులు ఏపీ పీజీసెట్ పరీక్షల కోసం మొత్తం 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలను జూన్ 11వ తేదీ నుంచి 15 తేదీల మధ్య విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అనంతరం 13వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 25వ తేదీన తుది ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల విడుదల తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు. ఏపీ పీజీసెట్ – 2025 పరీక్షల్లో సాధించిన ర్యాంకు ఆధారంగా, రిజర్వేషన్లను పరిగణంలోకి తీసుకొని సీట్లను కేటాయించడం జరుగుతుంది.