AP PGECET 2025 Results: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ఏపీ పీజీఈసెట్‌-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 93.55 శాతం మంది అభ్యర్థులు పాసయ్యారు.

AP PGECET 2025 Results: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Ap pgecet 2025 reasults released

Updated On : June 25, 2025 / 1:37 PM IST

ఆంధ్రప్రదేశ్ ఏపీ పీజీఈసెట్‌-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 93.55 శాతం మంది అభ్యర్థులు పాసయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఏపీ పీజీఈసెట్‌ లో భాగంగా 13 సబ్జెక్టులకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తంగా 14,231 మంది దరఖాస్తు చేసుకోగా 11,244 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక త్వరలోనే కౌన్సెలింగ్ డేట్స్, షెడ్యూల్ కూడా ఖరారు చేయనున్నారు అధికారులు.

మీ ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/PGECET/ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పీజీఈసెట్‌ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
  • తరువాత వ్యూ ర్యాంక్ కార్డ్ లింక్ పై క్లిక్ చేయాలి
  • ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.

మీ ర్యాంక్ ను మనమిత్ర వాట్సాప్ లో ఇలా తెలుసుకోండి:

  • ముందుగా ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ పెట్టాలి.
  • తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ సెలెక్ట్ చేసుకోవాలి.
  • అందులో ‘ఏపీ పీజీఈసెట్ ఫలితాలు – 2025’ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ పీజీఈసెట్‌ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
  • మీ ర్యాంక్ కార్డు డిస్లే అవుతుంది.
  • దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.