AP Polycet 2025 Counselling: ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ కొత్త షెడ్యూల్ విడుదల.. జులై 9న సీట్ల కేటాయింపు.. పూర్తి వివరాలు మీకోసం
సాంకేతి విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వాయిదా పడగా.. తాజాగా కొత్త కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించారు.

AP Polycet 2025 counselling new schedule released
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు సాంకేతి విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వాయిదా పడగా.. తాజాగా కొత్త కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించారు. జూలై 5 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులకు జూలై 9న సీట్లు కేటాయించనున్నారు అధికారులు. ఇందుకోసం అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://polycet.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు:
రిజిస్ట్రేషన్ రుసుము: కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.
జూలై6న అభ్యర్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.
జూలై 9న అభర్ధుల ర్యాంక్స్ ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.
జూలై 10 నుంచి 14 మధ్య సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
లేదంటే కేటాయించిన సీట్ క్యాన్సిల్ అవుతుంది.
జూలై 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
మరిన్ని వివరాల కోసం, ఏదైనా సందేహాల కోసం convenorpolycetap2025@gmail.com కు మెయిల్ లేదా 9177927677, 7995865456, 7995681678 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
ఇక గత నెలలోనే ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 1,39,840 మంది అభ్యర్థులు హాజరు కాగా 1,33,358 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరంతా జులై 5న మొదలుకానున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనటారు. అధికారులు వారి వారి ర్యాంక్ ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.