రేపే AP పదో తరగతి ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (APBSE) ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం(మే 14)న 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
అసలైతే పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఎప్పుడో పూర్తైంది. ఫలితాలలో ఎటువంటి తప్పులు జరగకుండా ఫలితాలు అనౌన్స్ చేసేందుకే అధికారులు సమయం తీసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,17,484 మంది విద్యార్థులు హాజరయ్యారు.