JOBS : ముంబయి మజ్ గావ్ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆయా గ్రూపులని అనుసరించి ఎనిమిది, పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు గ్రూప్-ఎ 19 ఏళ్లు, గ్రూప్-బి 21 ఏళ్లు, గ్రూప్-సి అభ్యర్థులు 18 ఏళ్లు మించరాదు.

Mazgaon, Mumbai
JOBS : భారత ప్రభుత్వానికి చెందిన ముంబయిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ లో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 445 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్ గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి ట్రేడుల్లో డ్రాఫ్ట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, వెల్డర్, కోపా తదితరాలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆయా గ్రూపులని అనుసరించి ఎనిమిది, పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు గ్రూప్-ఎ 19 ఏళ్లు, గ్రూప్-బి 21 ఏళ్లు, గ్రూప్-సి అభ్యర్థులు 18 ఏళ్లు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలను ముంబయి, నాగ్‌పూర్, పుణె, ఔరంగబాద్ లలో ఏర్పాటు చేశారు. దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 21, 2022గా నిర్ణయించారు. పరీక్ష తేదీ: జూలై 30, పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://mazagondock.in/ పరిశీలించగలరు.