ఏపి విద్యుత్‌ శాఖలో 206 పోస్టులు

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 09:14 AM IST
ఏపి విద్యుత్‌ శాఖలో 206 పోస్టులు

Updated On : February 2, 2019 / 9:14 AM IST

ఏపి మంత్రి కళావెంటరావు శనివారం ఫిబ్రవరి(2, 2019)న  మీడియాతో మాట్లాడుతు ఏపి ప్రభుత్వ రంగం సంస్థలో ఖాళీలుగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలపారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపి రాష్ట్ర విద్యుత్ శాఖలో ఏపి ట్రాన్స్‌కో, ఏపి(SPDCL), ఏపి(EPDCL) సంస్థల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్ పోస్టుల భర్తీకి శుక్రవారం ఫిబ్రవరి(1, 2019)న నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు తెలిపారు.

   పోస్టు పేరు                        ఎన్ని పోస్టులు

ఏపి ట్రాన్స్‌కో                                171

ఏపి(SPDCL)                             20

ఏపి(EPDCL)                             15

మొత్తం                                      206

మొత్తంగా 206 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని  ప్రకటన జారీచేశామన్నారు. విద్యుత్‌ సంస్థలైన ఏపి ట్రాన్స్‌కో, ఏపిడిస్కమ్స్ సమావేశంలో పెరిగిన విద్యుత్ వినియోగదారుల అవసరాలు, ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా ఈనియామకాలు చేపట్టాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించామని విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు.