బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 09:22 AM IST
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

Updated On : December 12, 2019 / 9:22 AM IST

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -2,  జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -3  ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 300 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

విభాగాల వారీగా ఖాళీలు : 
జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్2 – 200
జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్3 – 100

విద్యార్హత :
అభ్యర్ధులు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పై కొంత అనుభవం ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు :
SC,ST అభ్యర్ధులు రూ.118 చెల్లించాలి. జనరల్, ఓబిసీ, EWS అభ్యర్థులు మాత్రం రూ.1180 చెల్లించాలి. దివ్యాంగులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం : 
అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వూ, డాక్య్రూమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదిలు :
> దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 11, 2019.
దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 31, 2019.