CBSE ప్రాక్టికల్ ఎగ్జామ్ షెడ్యూలు రిలీజ్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (CBSE) 10, ఇంటర్ విద్యార్ధుల ప్రాక్టికల్స్ ఎగ్జామ్ తేదీలను విడుదల చేసింది. ఈ షెడ్యూలు ప్రకారం జనవరి 1, జరుగుతాయి. ఫిబ్రవరి 15 నుంచి CBSE మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి.
ఈ సంవత్సరం ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఫిబ్రవరిలోనే ప్రారంభంకానున్నాయి. మార్చి చివరివారం వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. CBSE 10వ తరగతి ఫలితాలు మే 2న, ఇంటర్ ఫలితాలు మే 6న ప్రకటించనున్నారు.
అంతేకాదు ఈసారి 10వ తరగతి విద్యార్థులకు స్టాండర్డ్ మ్యాథ్స్ ఎగ్జామ్, బేసిక్ మ్యాథ్స్ ఎగ్జామ్ అని రెండు మ్యాథమెటిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. విద్యార్ధులకు ముందుగానే అన్ని విషయాలను తెలియజేయాలని సంబంధిత పాఠశాలల యాజమాన్యాలను బోర్డు ఆదేశించింది.