10th Board Exams: కొత్త విద్యా విధానం.. ఇకనుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలు రెండుసార్లు.. సీబీఎస్ఈ ఆమోదం

10th Board Exams: 2026 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

10th Board Exams: కొత్త విద్యా విధానం.. ఇకనుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలు రెండుసార్లు.. సీబీఎస్ఈ ఆమోదం

Class 10 exams to be held twice from 2026

Updated On : June 26, 2025 / 3:18 PM IST

2026 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈమేరకు కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. కొత్త జాతీయ విద్యావిధానం 2020లో చేసిన సిఫార్సు ప్రకారం.. 10వ తరగతికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలానే నిబంధనలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆమోదం తెలిపింది. బుధవారం(జూన్ 25) వచ్చిన ఆమోదం ప్రకారం 2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు రెండుసార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాసే అవకాశం ఉంది.

ఈ ఆమోదం ప్రకారం ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి మరియు మే లో ఈ పరీక్షలు ఉండనున్నాయి. కానీ, ఫిబ్రవరిలో జరిగే పరీక్షలకు మాత్రం విద్యార్థులందరూ తప్పకుండా హాజరుకావాల్సిందే అని నిర్ణయించారు. ఇక మేలో జరిగే పరీక్షల్లో వచ్చిన మార్కులకు మరిన్ని మార్కులను జతచేసుకునే లా ఇంప్రూమెంట్ రాసుకునే అవకాశాన్ని కలిపించారు. ఇక రెండు దశల పరీక్షల ఫలితాలను ఏప్రిల్, జూన్లో ప్రకటించనున్నారు. సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో ఏదైనా మూడు సబ్జెక్టుల్లో విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. కానీ, ఇంటర్నల్ మాత్రం ఒకేసారి ఉండనున్నాయి.