CBSE Scholarship : ఇంటర్మీడియట్ పాసైన విద్యార్ధులకు సీబీఎస్ఈ స్కాలర్ షిప్ దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుచేసుకునే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షల లోపు ఉండాలి. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరే ఇతర స్కాలర్‌షిప్ ప్రయోజనాన్ని పొందకూడదు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సౌకర్యాన్ని పొందకుండా ఉండాలి.

CBSE Scholarship : ఇంటర్మీడియట్ పాసైన విద్యార్ధులకు సీబీఎస్ఈ స్కాలర్ షిప్  దరఖాస్తుల ఆహ్వానం

Scholarship

Updated On : October 17, 2023 / 11:57 AM IST

CBSE Scholarship : ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువులు అభ్యసించాలనుకుని ఆర్ధికంగా స్ధోమత లేనివారికి సీబీఎస్ ఈ స్కాలర్ షిప్ లు అందజేస్తుంది. CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు కాలేజీ/యూనివర్శిటీలో చేరితే వారికి స్కాలర్ షిప్ లను అందజేయనుంది. 2023-24 సంవత్సరాలనికి గాను స్కాలర్ షిప్ లు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

READ ALSO : Natural Anaesthesia : అనస్థీషియా లక్షణాలతో కూడిన ఆహారాలు.. అవేంటో తెలుసా ?

సీబీఈఎస్ ఈ స్కాలర్‌షిప్ 2023 దరఖాస్తు చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే అభ్యర్థి తప్పనిసరిగా 12వ బోర్డు పరీక్షలో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. కాలేజీలోరెగ్యులర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొంది ఉండాలి. డిస్టెన్స్, కరస్పాండెన్స్ కోర్సుల్లో చేరిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. దరఖాస్తుచేసుకునే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షల లోపు ఉండాలి. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరే ఇతర స్కాలర్‌షిప్ ప్రయోజనాన్ని పొందకూడదు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సౌకర్యాన్ని పొందకుండా ఉండాలి. డిప్లొమా కోర్సును అభ్యశిస్తున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు కాదు.

READ ALSO : Seasonal Diseases : పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. నివారణకు అనుసరించాల్సిన సరైన పద్ధతులు

సీబీఈఎస్ ఈ స్కాలర్ షిప్ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుచేసుకునేందుకు డిసెంబర్ 31, 2023 ఆఖరి గడువు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; scholarships.gov.in పరిశీలించగలరు.