CISF లో 914 కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (CISF) పలు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కుక్, బార్బర్, కార్పెంటర్, స్వీపర్, పెయింట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం :
అభ్యర్ధులను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రెడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 20 నుంచి 70వేల వరకు జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్, OBC, EWS అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు అవసరం లేదు.
వయసు:
అభ్యర్ధులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 23, 2019.
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 22, 2019.