CMAT 2025 Admit Card : సీమ్యాట్ 2025 అడ్మిట్ కార్డ్ త్వరలో విడుదల.. పూర్తి వివరాలివే!
CMAT 2025 Admit Card : సీమ్యాట్ 2025 పరీక్ష అడ్మిట్ కార్డ్‌ని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

CMAT 2025 Admit Card
CMAT 2025 Admit Card : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT) 2025 అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అనుబంధ సంస్థల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 25న పరీక్ష నిర్వహించాల్సి ఉంది.
Read Also : TikTok Ban : టిక్‌టాక్ ఈజ్ బ్యాక్.. కేవలం 24 గంటల్లోనే నిషేధం ఎత్తివేత.. ఎందుకంటే?
ఎన్టీఏ పరీక్ష సిటీ స్లిప్‌లు విడుదల :
సీమ్యాట్ 2025 పరీక్షా విధానం :
సీమ్యాట్ 2025 పరీక్షా విధానం 5 సెక్షన్లను కలిగి ఉంటుంది. ఒక్కొక్కటి 20 ప్రశ్నలు, క్వాంట్ అండ్ డీఐ, లాజికల్ రీజనింగ్, వీఏఆర్‌సీ, జనరల్ నాలెడ్జ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. పరీక్ష మొత్తం 100 మార్కులతో 100 ప్రశ్నలను కలిగి ఉంటుంది. మూడు గంటల పాటు జరుగుతుంది.
సీమ్యాట్ 2025 మార్కింగ్ స్కీమ్ :
ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తీసివేస్తారు. సమాధానం లేని లేదా ప్రయత్నించని ప్రశ్నలకు మార్కులు రావు. అభ్యర్థులు ఒక ప్రశ్నకు ప్రతిస్పందించడానికి సరైన ఆప్షన్ ఎంచుకోవాలి. జవాబు కీని సవాలు చేసి, సవరించినట్టయితే అప్‌డేట్ చేసిన కీ ఆధారంగా మార్కులు ఇస్తారు.
మల్టీపుల్ సరైన ఆప్షన్లు గుర్తించిన సందర్భాల్లో తదనుగుణంగా మార్కులు ఇస్తారు. టెక్నికల్ సమస్య కారణంగా ఒక ప్రశ్న తొలగిస్తే.. అభ్యర్థులందరూ ఆ ప్రశ్నకు ప్రయత్నించినా సంబంధం లేకుండా పూర్తి మార్కులను అందుకుంటారు.
సీమ్యాట్ 2025 పరీక్ష అర్హతలివే :
సీమ్యాట్ 2025కి అర్హత పొందాలంటే, అభ్యర్థులు ఏదైనా రంగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయి ఉండాలి. పరీక్షలో హాజరు కావడానికి వయోపరిమితి లేదు.
Read Also : NEET PG Counselling 2024 : నీట్ పీజీ కౌన్సెలింగ్ రౌండ్ 3 రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?