DEECET-2019 దరఖాస్తు గడువు పెంపు

డీసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) – 2019 దరఖాస్తు గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించారు. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ మార్చి 30వ తేదీ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు గడువు మార్చి 11 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉంది. పలువురి విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించడం జరిగిందని తెలిపారు. మరిన్ని వివరాలకు http://deecet.cdse.telangana.gov.in వెబ్ సైట్‌లో చూడాలని సూచించారు.
రెండేండ్ల కాల వ్యవధిలో ఈ కోర్సును నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్ ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డీఐఈటీలతో పాటు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ (మైనార్టీ/మైనార్టీ యేతర)ఇనిస్టిట్యూషన్‌లో ఈ కోర్సులు నిర్వహిస్తారు. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఈ కోర్సులు ఉంటాయి. రెండేండ్ల కోర్సులకు ఈ నెల 11 నుంచి ఏప్రిల్ 4 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఈ గడువును అధికారులు పెంచారు.