హైదరాబాద్‌లో ప్రారంభమైన EarlyJobs ఫ్రాంచైజ్.. స్థానిక యువతలోని టాలెంట్‌ను కార్పొరేట్ సంస్థలకు పరిచయం చేసేలా..
వారు స్థానిక కాలేజీలతో పార్ట్‌నర్‌షిప్‌లు ఏర్పరచుకుని, నియామక కార్యక్రమాలు నిర్వహించవచ్చు. EarlyJobs ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగార్థులు ఆంగ్లం లేదా స్థానిక భాషలో ప్రొఫైల్ సృష్టించుకోవచ్చు.

తెలంగాణలో ప్రతి ఏడాది లక్షలాది మంది డిగ్రీ పాసై ఉద్యోగాన్వేషణను ప్రారంభిస్తుంటారు. కార్పొరేట్ ఉద్యోగం సాధించాలంటే నగరాలకు వలస వెళ్లాలి. భాషా సమస్యలు, నగరాల్లో పరిచయాలు లేకపోవడం అనేవి ప్రధాన అడ్డంకులుగా మారతాయి. ఇప్పుడు ఈ పరిస్థితులు మారబోతున్నాయి.
దేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఆధారిత నియామక వేదిక EarlyJobs ఇప్పుడు హైదరాబాద్‌లో తమ కొత్త ఫ్రాంచైజ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా నగరంలోని, పరిసర గ్రామ ప్రాంతాల యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఇది కేవలం ఒక కార్పొరేట్ విస్తరణ మాత్రమే కాదు. ఇది గ్రామీణ, ప్రాంతీయ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించే విధానంలో ఒక మైలురాయి వంటిది.
ఉద్యోగార్థుల సమస్యలకు పరిష్కారం
నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలాంటి పట్టణాల్లోని యువత చదువులో ప్రతిభావంతులే అయినా, సరైన ఉద్యోగ అవకాశాలు దొరకక ఉద్యోగాల కోసం వార్తాపత్రికలు, వాట్సాప్ ఫార్వర్డ్‌లు, లేదా మిత్రుల సూచనలపై ఆధారపడతారు. ఈ పద్ధతులు అవలంబిస్తే తక్కువ జీతం, అన్‌ఫిట్ రోల్స్ లేదా ఫ్యూచర్‌లో అభివృద్ధిలేని ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది.
EarlyJobs ఈ లోటును తీర్చేందుకు స్థానిక Hiring హబ్‌లను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌లో ప్రారంభించిన కొత్త ఫ్రాంచైజ్ నగరంలోని యువతకు మాత్రమే కాదు, చుట్టుపక్కల జిల్లాల యువతకు కూడా కార్పొరేట్ అవకాశాలకు మార్గాన్ని చూపబోతుంది.
EarlyJobs ప్రత్యేకత ఏమిటంటే ఇది Decentralized Hiringపై నమ్మకాన్ని పెంచేలా పనిచేస్తోంది. దీని ద్వారా మెట్రో నగరాలకే కాకుండా, స్థానికంగా ఉన్న ఉద్యోగాలకూ పూర్తి భద్రత, సాంకేతిక సపోర్ట్‌తో ఉద్యోగ సేవలు అందించవచ్చు.
ఫ్రాంచైజీలు EarlyJobs సంస్థ అర్థిక మోడల్, సాంకేతిక వ్యవస్థ, జాతీయ కంపెనీ మాండేట్లతో కలిసి పనిచేస్తాయి. వారు స్థానిక కాలేజీలతో పార్ట్‌నర్‌షిప్‌లు ఏర్పరచుకుని, నియామక కార్యక్రమాలు నిర్వహించవచ్చు. EarlyJobs ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగార్థులు ఆంగ్లం లేదా స్థానిక భాషలో ప్రొఫైల్ సృష్టించుకోవచ్చు.
Also Read: ఓ గుడి కోసం రెండు దేశాల ‘యుద్ధం’.. ఏంటి ఆ ఆలయ చరిత్ర? ప్రత్యేకత?
కీలక అంశాలు
- AI ఆధారిత నైపుణ్య పరీక్షలు (కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్ వంటివి)
- వ్యక్తిగతంగా సరిపోయే ఉద్యోగ సూచనలు
- రిజ్యూమ్ స్కోరింగ్, మెరుగుదల సూచనలతో పాటు
- Mock ఇంటర్వ్యూలు, ఫీడ్‌బ్యాక్‌తో పాటు కార్పొరేట్ శిక్షణ
ఈ విధంగా, వారు ఉద్యోగానికి అర్హులుగా తయారవుతారు. ఇది ప్రత్యేకంగా ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్లకు ఎంతో సహాయపడుతుంది. బల్క్ హైరింగ్ కోసం కంపెనీలు చిన్న పట్టణాల్లో నియామక ప్రక్రియను నిర్వహించడం కష్టం అనిపించేది.
కానీ EarlyJobsలో…
- నైపుణ్యపరంగా స్క్రీన్ చేసిన అభ్యర్థులను వెంటనే అందిస్తుంది
- స్థానిక ఫ్రాంచైజీలు బల్క్ హైరింగ్ డ్రైవ్స్ నిర్వహిస్తాయి
- స్క్రీనింగ్, ఇంటర్వ్యూల సమయంలో ఖర్చును తగ్గిస్తుంది
- స్థానిక భాష, సంస్కృతిని అర్థం చేసుకుని నియామకాన్ని మెరుగుపరుస్తుంది
ఇది ముఖ్యంగా BFSI, BPO, ఎడ్టెక్, లాజిస్టిక్స్ రంగాల కంపెనీలకు ఎంతో ఉపయోగపడుతుంది.
తెలంగాణ, ఆంధ్రాలో మరిన్ని కేంద్రాలు
హైదరాబాద్‌లో మాత్రమే కాదు. EarlyJobs ఇంకా కొత్త ఫ్రాంచైజీలు తెరవాలని యోచిస్తోంది. విశాఖపట్నం, కాకినాడ, నల్గొండ, కర్నూలు వంటి జిల్లాలు టార్గెట్‌గా ఉన్నాయి. ప్రతి ఫ్రాంచైజీ స్థానిక కాలేజీలతో టైఅప్‌లు, రీజనల్ భాషల్లో శిక్షణ, AI టూల్స్ వినియోగం వంటి కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది.
“యువతకు టాప్ ఉద్యోగాలను అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం. హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ ఫ్రాంచైజ్ ద్వారా స్థానిక ప్రతిభను జాతీయ స్థాయిలో పరిచయం చేస్తున్నాం. దీనిద్వారా కేవలం ఉద్యోగ అకాశాలను ఇప్పటించడమే కాకుండా, వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాం” అని EarlyJobs ప్రాంతీయ డైరెక్టర్ తెలిపారు.
యువత ఉద్యోగం కోసం నగరాలకే పరిమితం కాకూడదు. EarlyJobs ఇప్పుడు స్థానికంగా Hiring సదుపాయాలు తీసుకొస్తోంది. ఈ విషయంలో ప్రతి ఫ్రాంచైజీ ఒక కొత్త మార్గాన్ని చూపుతోంది. అక్కడి నుంచే మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలను కల్పిస్తోంది.