ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 02:36 AM IST
ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు

Updated On : November 12, 2019 / 2:36 AM IST

తెలంగాణ సార్వత్రి విద్యాపీఠం ప్రవేశాల గడువును (నవంబర్ 17, 2019) వరకు పొడిగించినట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ, ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా సమన్వయ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అపరాద రుసుము చెల్లించి నవంబర్ 17 తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చని వెల్లడించారు. 2019-20 విద్యాసంవత్సరానికి గాను ఎస్ఎస్ సీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. 

అభ్యర్థులు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తీసుకొని జిల్లా పరిధిలోని అధ్యయన కేంద్రాలను సంప్రదించి telanganaopenschool. org వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తును పూరించాలని సూచించారు. డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్, మీసేవా, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ప్రవేశ రుసుమును చెల్లించాలన్నారు. అపరాద రుసుముగా ఎస్ఎస్ సీకి రూ. 100, ఇంటర్మీడియట్ కు రూ. 200 లను చెల్లించాలని వెల్లడించారు.