JOBS : టీఎస్ గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్ ఖాళీల భర్తీ
దరఖాస్తుల చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మొదటి శ్రేణిలో పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ డ్ , నీట్, ఎంసెట్ శిక్షణకు సంబంధించి బోధించటంలో అనుభవం కలిగి ఉండాలి.

Jobs
JOBS : తెలంగాణ సాంఘిక , గిరిజన సంక్షేమ, ఏకలవ్య గురుకులాల్లో పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ ఖాళీలు భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 149 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే గణితం 26 ఖాళీలు, జంతు శాస్త్రం 32 ఖాళీలు, భౌతిక శాస్త్రం 29 ఖాళీలు, రసాయన శాస్త్రం 32 ఖాళీలు, వృక్ష శాస్త్రం 30 ఖాళీలు, ఉన్నాయి.
దరఖాస్తుల చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మొదటి శ్రేణిలో పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ డ్ , నీట్, ఎంసెట్ శిక్షణకు సంబంధించి బోధించటంలో అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు
పంపేందుకు జులై 23ను చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.tgtwgurukulam.telangana.gov.in పరిశీలించగలరు.