JOBS : ఐఎస్ఐ లో రిసెర్చ్ అసోసియేట్ల ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పీహెచ్ డీ ఉత్తీర్ణత, థీసిస్ సమర్పించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

JOBS : ఐఎస్ఐ లో రిసెర్చ్ అసోసియేట్ల ఖాళీల భర్తీ

Isi Kolkata

Updated On : June 16, 2022 / 8:30 PM IST

JOBS : కోల్ కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో రిసెర్చ్ అసోసియేట్స్ పోస్టులు ఉన్నాయి. డెవలప్ మెంట్ స్టడీస్, ఎకనమిక్స్, ఎకనామెట్రిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైకాలజీ, సైకోమెట్రిక్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పీహెచ్ డీ ఉత్తీర్ణత, థీసిస్ సమర్పించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి విద్యార్హతలు, అనుభవం అధారంగా నెలకు 47,000 నుండి 49,000, 54000 మరియు హెచ్ ఆర్ ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం విషయానికి వస్తే సెమినార్, పర్సనల్ ఇంటరాక్షన్ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది 30 జూన్ 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;