గుడ్ న్యూస్ : బీఎడ్‌లకూ ఎస్జీటీ

ఢిల్లీ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ, డీఎడ్ చేసిన వారు 6,7,8 తరగతుల బోధనకు అర్హులేనని…సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది. బీఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు బోధించాలంటే ప్రైమరీ స్కూల్ టీచర్‌గా ఎంపికైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌పై బ్రిడ్జీ కోర్సు చేయాలన్న షరతు విధించింది. 2001లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అమల్లోకి తెచ్చిన సమయంలో ఈ నిబంధన కారణంగా ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులకు దూరమైన బీఎడ్ అభ్యర్థులు ఇకపై ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే వీలు కలిగినట్లైంది. బీఎడ్ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొంది.
మరోవైపు 6వ తరగతి నుండి 8వ తరగతి చెప్పే టీచర్ పోస్టులకు డిగ్రీతో పాటు బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు..డిగ్రీతో డీఎడ్ పూర్తియన వారు, ఇంటర్ మీడియట్‌తో నాలుగేళ్ల బీఈఎల్ఈడీ పూర్తి చేసిన వారు..లేదా…ఫైనల్ ఇయర్ వారు, ఇంటర్ మీడియట్‌తో ఇంటిగ్రీటెడ్ బీఎడ్ పూర్తి చేసిన వారంతా అర్హులేనని తెలిపింది. అలాగే డీఎడ్ చేసిన వారికి డిగ్రీ ఉ:టే వారు కూడా 6, 7, 8 తరగతుల బోధనకు అర్హులని తెలిపింది. ప్రస్తుతం సీటెట్ దరఖాస్తుల స్వీకరణను సీబీఎస్ఈ ప్రారంభించింది. జులై 7వ తేదీన నిర్వహించనున్న సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్టు నుండే అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం కలుగనుంది.