IBPS RRB Vacancy 2023 : నిరుద్యోగులకు అలర్ట్.. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలు, అప్లయ్ చేసుకోవడానికి రేపే లాస్ట్
IBPS RRB Jobs : ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.

IBPS RRB Vacancy 2023 (Photo : Google)
IBPS RRB Jobs : మీరు ప్రభుత్వ బ్యాంకులో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? బ్యాంక్ లో కొలువు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ న్యూస్ మీ కోసమే. దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి రేపే (జూన్ 21) లాస్ట్ డేట్.
దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం 8వేల 612 జాబ్స్ భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 678 పోస్టులు ఉండగా, తెలంగాణలో 112 ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫీసర్స్ (స్కేల్ -1,2,3), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
* ఎంపిక ప్రక్రియ- ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా.
* దరఖాస్తుకు చివరి తేదీ- జూన్ 21.
* పూర్తి వివరాలకు వెబ్ సైట్- www.ibps.in
ఐబీపీఎస్(Institute of Banking Personnel Selection) రీజనల్ రూరల్ బ్యాంకుల్లో రిక్రూట్ మెంట్ కోసం నోటఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు.
ఒక అభ్యర్థి Office Assistant (Multipurpose) పోస్టుతో పాటు ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే, ఒక అభ్యర్థి ఆఫీసర్ కేడర్ పోస్టులకు సంబంధించి కేవలం ఒక పోస్టుకే(Officer Scale 1 or Scale 2 or Scale 3) దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టులో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షల రిజల్ట్స్ సెప్టెంబర్ లో విడుదల చేస్తారు. అదే నెలలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అక్టోబర్ లో ఫలితాలు విడుదల చేస్తారు. అక్టోబర్ లేదా నవంబర్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జనవరిలో పోస్టింగ్స్ ఖరారు చేస్తారు.