JOBS : ఐటీబీపీ లో గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టుల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.

Processed With Vsco With A6 Preset
JOBS : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీఎఫ్) లో గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 56,100రూ నుండి 1,77500రూ వేతనంగా చెల్లిస్తారు. దరఖాస్తులు ఆగస్టు 11 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 9, 2022 చివరితేదిగా నిర్ణయించారు.