హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్(HCL) లో అప్రెంటిస్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 09:40 AM IST
హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్(HCL) లో అప్రెంటిస్ ఉద్యోగాలు

Updated On : February 5, 2020 / 9:40 AM IST

హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్(HCL) లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 161 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
మేట్(మైన్స్) – 30
బ్లాస్టర్(మైన్స్) – 30
ఫిట్టర్ – 25
టర్నర్ – 5
వెల్డర్ – 15
ఎలక్ట్రీషియన్ – 30
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 6
డ్రాప్ట్స్ మెన్(సివిల్, మెకానికల్) – 5
మెకానిక్ డీజల్ – 10
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ – 1
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 2

విద్యార్హత : అభ్యర్ధులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయస్సు : అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్ధులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 28, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 15, 2020.