Jobs : బ్యాంకింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్న ఐబీపీఎస్

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ టెస్ట్, మెయిన్‌ ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

Jobs : బ్యాంకింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్న ఐబీపీఎస్

Jobs : ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకాగా, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6432 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగ ఖాళీల వివరాలకు సంబంధించి కెనరా బ్యాంక్ 2500, యూకో బ్యాంక్ 550, బ్యాంక్ ఆఫ్ ఇండియా 535,పంజాబ్ నేషనల్ బ్యాంక్500,పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్253,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా2094 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ టెస్ట్, మెయిన్‌ ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యుబీడీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.850 చెల్లిస్తే సరిపోతుంది.

ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవానికి ఆగస్టు 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్; ibps.in పరిశీలించగలరు.