నోట్ల రద్దు ఎఫెక్ట్ : నిరుద్యోగ దేశం అయ్యింది

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 06:03 AM IST
నోట్ల రద్దు ఎఫెక్ట్ : నిరుద్యోగ దేశం అయ్యింది

ఢిల్లీ: దేశ శ్రేయస్సు కోసం అంటూ నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. 2018 నవంబర్ 6వ తేదీన పెద్ద నోట్లను(రూ.500, రూ.1000) ప్రధాని మోదీ రద్దు చేశారు. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు, నకిలీ నోట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం అని ప్రధాని మోదీ గొప్పలు చెప్పారు. మరి డీమానిటైజేషన్ ద్వారా అవన్నీ సాధించారో లేదో తెలియదు కానీ.. నిరుద్యోగ సమస్య మాత్రం భారీగా పెరిగిపోయింది. ఏకంగా నాలుగేళ్ల గరిష్టానికి నిరుద్యోగం పెరిగిపోయింది. లేబర్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ఈ షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఈ నివేదికను కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ స్వయంగా ఆమోదించారు. నిరుద్యోగ సమస్య పెరగటమే కాదు పని చేసే వాళ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది.

సంవత్సరం, నిరుద్యోగ శాతం
* కాంగ్రెస్ పాలనలో 2012-13లో 4శాతం
* 2013-14లో 3.4శాతం
* 2016 సెప్టెంబర్‌లో 8.46శాతం
* 2017 డిసెంబర్‌లో 4.78శాతం
* 2018 డిసెంబర్‌లో 7.38శాతం
* సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం 2018 డిసెంబర్ నాటికి 7.38 శాతం

నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయ్యింది. దీన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీపై దాడికి దిగింది. నోట్ల రద్దు వల్ల ప్రయోజనం ఉండదని తాము నెత్తీ నోరు బాదుకున్నా ప్రధాని మోదీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి కల్పనలో బీజేపీ ఘోరంగా విఫలం అయ్యిందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. 2 కోట్ల ఉద్యోగాల మాట అటుంచితే.. కోటికిపైగా ఉద్యోగాలు పోయాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇదేనా మోదీ సాధించిన ఘనత? అని నిలదీస్తున్నారు.