ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు పోస్టులు

ఇండియన్ ఆర్మీలో 2020 జనవరిలో ప్రారంభమయ్యే 130 వ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ కోర్సుకు ఎంపికైన అభ్యర్ధులకు డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత సర్వీసులోకి తీసుకుంటారు.
మొత్తం ఖాళీలు: 40..వీటిలో సివిల్-10 , ఆర్కిటెక్చర్-1 ,మెకానికల్-6, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్-6, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్-8, ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్-5, ఎలక్ట్రానిక్స్-1, మెటలర్జికల్-1, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్-1, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్-1,
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
వయస్సు: 2020 జనవరి 1 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక: విద్యార్హత మార్కులు, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ/టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. శారీరక వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు కు చివరి తేదీ : మే 9 ,2019 పూర్తి వివరాలకొరకు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in ను సంప్రదించండి.