Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. 15 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. నెలలు రూ.56 వేల జీతం.. దరఖాస్తు, అర్హత, పూర్తి వివరాలు

Indian Navy Recruitment: SSC ఎగ్జిక్యూటివ్ (IT) రిక్రూట్‌మెంట్ 2025ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం 15 ఖాళీలను భర్తీ చేయనుంది.

Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. 15 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. నెలలు రూ.56 వేల జీతం.. దరఖాస్తు, అర్హత, పూర్తి వివరాలు

Indian Navy SSC Executive Recruitment 2025 Notification Released

Updated On : July 29, 2025 / 11:42 AM IST

దేశ రక్షణలో నావికా దళం ముఖ్యపాత్ర పోషిస్తోంది. అయితే, ఈ రక్షణ దళంలో ఐటీ కేడర్ చాలా ప్రధానమైనది. అందుకే ఈ విభాగంలో సేవలను అందించేందుకు ప్రతిభావంతులైన డౌనమిక్ యువతీయువకుల కోసం చూస్తోంది. ఇందులో భాగంగానే దేశ సేవలో పాలు పంచుకోవాలనుకునే వారికి ఇండియన్ నేవీ గుడ్ న్యూస్ చెప్పింది. SSC ఎగ్జిక్యూటివ్ (IT) రిక్రూట్‌మెంట్ 2025ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం 15 ఖాళీలను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ఆగస్టు 17 వరకు కొనసాగనుంది. పెళ్లికాని యువతీ యువకులకు ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్ సైట్ https://www.joinindiannavy.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు:
అభ్యర్థులు తప్పకుండా 10వ తరగతి, 12వ తరగతి పాసై ఉండాలి. అందులో ఇంగ్లీషులో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.

కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్/ సైబర్ సెక్యూరిటీ/ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ & నెట్‌వర్కింగ్/ కంప్యూటర్ సిస్టమ్స్ & నెట్‌వర్కింగ్/ డేటా అనలిటిక్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో M.Sc./ BE/ B.Tech/ M.Tech చేసి ఉండాలి.

BCA/ B.Sc (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) తో MCA ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 2, 2001, జూలై 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.

వేతన వివరాలు:
7వ కేంద్ర వేతన సంఘం (CPC) పే లెవల్ 10 ఆధారంగా నెల జీతం రూ.56,100 నుండి ప్రారంభమవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక 4 దశల్లో జరుగుతుంది. అప్లికేషన్ షార్ట్ లిస్ట్, సర్వీస్ సెక్షన్ బోర్డు ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష, మెరిట్ లిస్ట్

దరఖాస్తు ఇలా చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://www.joinindiannavy.gov.in/ లోకి వెళ్ళాలి
  • “రిజిస్టర్” ఆప్షన్ పై క్లిక్ చేసి మీ వ్యక్తిగత ఖాతాను క్రియేట్ చేసుకోవాలి.
  • మీ వ్యక్తిగత వివరాలతో లాగిన్ అవ్వాలి
  • ఖచ్చితమైన వివరాలతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
  • అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి
  • తరువాత దరఖాస్తును సబ్మిట్ చేయాలి
  • మీ రికార్డుల కోసం దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాలి.