ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది.

  • Published By: veegamteam ,Published On : October 26, 2019 / 11:20 AM IST
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

Updated On : October 26, 2019 / 11:20 AM IST

ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది.

ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ఈ మేరకు శనివారం (అక్టోబర్ 26, 2019) ఇంటర్‌ బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఆదేశాలు జారీ చేశారు. చివరి తేదీ (అక్టోబర్ 29, 2019) వరకు కాగా దానిని (నవంబర్ 4, 2019) తేదీ వరకు పొడగిస్తున్నట్లు వెల్లడించారు. 

ఇంటర్మీడియట్ రెగ్యులర్‌, సప్లిమెంటరీ, ప్రైవేట్‌ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. నవంబర్‌ 4వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకోవాలన్నారు. నవంబర్‌ 5వ తేదీ లోపు ఇంటర్మీడియట్ బోర్డు అకౌంట్‌లో ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ జమ చేయాలని ఆదేశించారు.