Job Mela: మీరు డిగ్రీ పూర్తి చేశారా.. పరీక్ష లేకుండానే జాబ్స్.. రూ.25 వేల జీతం.. మరిన్ని వివరాలు
Job Mela: APSSDC ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

Job mela in Ap
టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఈ మేరకు APSSDC ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. ఇక ఈ జాబ్ మేళాలో 9 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని, యువత తప్పకుండ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. Also Read: ఎస్బీఐ పీఓ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల.. రూ.48 వేల జీతం.. పూర్తి వివరాలు మీకోసం
విద్యార్హత: అభ్యర్థులు పదవ తరగతి నుంచి B.SC బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
జాబ్ మేళా తేదీ: జూన్ 26 2025 రోజున ఉదయం 09:30 గంటలకు ఈ జాబ్ మేళా మొదలుకానుంది.
వేతన వివరాలు: ఈ ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి అభ్యర్థులకు అర్హతను బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జీత అందిస్తారు.
కావాల్సిన ధ్రువపత్రములు: ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హత జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని రావాలని, కేవలం ఫార్మల్ డ్రెస్ లోనే రావాల్సి ఉంటుందని సూచించారు. Also Read: ఇంటర్ పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. SSC CHSL రిజిస్ట్రేషన్ మొదలు.. ముఖ్యమైన వివరాలు మీకోసం
ఇంకా ఏమైనా సందేహాలు ఉండే హెల్ప్ లైన్ నంబర్స్ 9154830286, 7673902328 ను సంప్రదించాలన్నారు.