Job Mela: ఏపీలో మెగా జాబ్ మేళా.. పోస్టర్ ఆవిష్కరణ మంత్రి కొల్లు రవీంద్ర

Job Mela: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న భారీ జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు మంత్రి కొల్లు రవీంద్ర అధికారిక ప్రకటన చేశారు.

Job Mela: ఏపీలో మెగా జాబ్ మేళా.. పోస్టర్ ఆవిష్కరణ మంత్రి కొల్లు రవీంద్ర

APSSDC Job Mela In Machillipatnam

Updated On : July 10, 2025 / 5:25 PM IST

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న భారీ జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు మంత్రి కొల్లు రవీంద్ర అధికారిక ప్రకటన చేశారు. ఈ జాబ్ మేళాకు సంబందించిన పోస్టర్ ను గురువారం(జులై 10) విడుదల చేశారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పుకోచ్చారు. దాదాపు 30 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనబోతున్నాయని ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుందో తెలియడానికి జులై 13 నుంచి 15 వరకు ప్రముఖ నేషనల్ కాలేజీలలో శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు.

మేఘా కంపెనీ, ఆక్వా రంగంలో ఉన్న ప్రసిద్ధ కంపెనీలను కూడా జాబ్ మేళాకు ఆహ్వానిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ జాబ్స్ కోసం 800 మంది RAMP ద్వారా రిజిస్టర్ చేసుకున్నారని, వారిని పారిశ్రామికంగా అభివృద్ధి సాధించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. MSME, PM Vishwakarma లాంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం చెప్పుకొచ్చారు. ఈ జాబ్ మేళా వివరాలను సచివాలయ సిబ్బంది గడపగడపకు వెళ్లి వివరించాలని, పార్టీ నాయకులు సైతం ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.