JOBS : బార్క్ లో ఉద్యోగ ఖాళీ భర్తీ
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది. ఫీజు వివరాలకు సంబంధించి రూ.100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ,మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31, 2022గా నిర్ణయించారు.
JOBS : భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) పరిధిలోని న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుల్లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుకు చివరి తేది సమీపిస్తోంది.
భర్తీ చేయనున్న పోస్టుల్లో పోస్టులు: గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్ స్టెనోగ్రాఫర్లు 6 పోస్టులు ఉన్నాయి. కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ,తత్సమాన ఉత్తీర్ణతతోపాటు టైపింగ్ స్పీడ్ ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
డ్రైవర్లు ఆర్డినరీ గ్రేడ్11 పోస్టులు భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. లైట్ వెహికిల్ అయితే మూడేళ్లు, హెవీ వెహికిల్ అయితే ఆరేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వయస్సు18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
వర్క్ అసిస్టెంట్లు 72 పోస్టులు భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది. ఫీజు వివరాలకు సంబంధించి రూ.100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ,మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.barc.gov.in పరిశీలించగలరు.