కేంద్రీయ విద్యాలయాల ప్రవేశ షెడ్యూలు

దేశంలోని వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలును కేంద్రీయ విద్యాలయాల సంగథన్ విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశ ప్రకటన విడుదల చేయనున్నారు.
1వ తరగతిలో ప్రవేశాలకు మార్చి 1 నుంచి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. 1వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల మొదటి జాబితాను మార్చి 26న విడుదల చేస్తారు. తర్వాత సీట్ల మిగులుతె దాన్ని బట్టి రెండో జాబితాను ఏప్రిల్ 9న, మూడో జాబితాను ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు.
2వ తరగతి నుంచి పదోతరగతి వరకు ప్రవేశాలు ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు ప్రక్రియ సాగనుంది. ఏప్రిల్ 12న ఎంపిక జాబితాను వెల్లడించనున్నారు. ఏప్రిల్ 12 నుంచి 20 వరకు ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 30 లోపు ప్రవేశం పొందాల్సి ఉంటుంది. ఇక క్లాస్-11 కి సంబంధించి ప్రవేశాలు కోరువారు ఫలితాలు వెల్లడైన 10 రోజుల తర్వాత అంటే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న పదిరోజుల్లో ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. ఎంపికైనవారు జులై 7 లోగా ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది.