మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల… పూర్తి వివరాలు ఇదిగో

ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేశారు.

మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల… పూర్తి వివరాలు ఇదిగో

AP DSC

Updated On : May 31, 2025 / 10:44 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఇవాళ విడుదలయింది. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి 30 వరకు జరిగేలా ఏర్పాట్లు చేశారు. విద్యాశాఖ ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టుల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేశారు.

Also Read: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో పాల్గొనడానికి నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్యలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు.

ఈ కారణంగా, పరీక్ష కేంద్రాలు ఆ రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థుల నుంచి పరీక్ష కేంద్రాల విషయంలో ఆప్షన్లు స్వీకరించారు.

పూర్తి వివరాలు..