AP Mega Job Mela: పరీక్ష లేకుండానే ఉద్యోగం.. రూ.3 లక్షల జీతం.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతె చాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో జూన్ 5న ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెలోని K.G.R. డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా

AP Mega Job Mela: పరీక్ష లేకుండానే ఉద్యోగం.. రూ.3 లక్షల జీతం.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతె చాలు

Mega Job Mela on June 5th

Updated On : June 3, 2025 / 4:42 PM IST

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. బనగానపల్లెలోని K.G.R. డిగ్రీ కాలేజీలో ఈనెల(జూన్) 5వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జిల్లా ఉపాధికల్పనా అధికారి సోమశివారెడ్డి అధికారిక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్రంలోని యువతకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా జిల్లాల వారీగా పదవ తరగతి ఆపై చదువులు చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ పరిధిలో ఈ ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈనెల(జూన్) 5వ తేదీన నంద్యాల జిల్లా బనగానపల్లెలోని K.G.R. డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న 15 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి. వాటిలో అమెజాన్, ఆక్సిస్ బ్యాంక్, జొమాటో, దొడ్ల డైరీ, హెటిరో ల్యాబ్స్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి.

అభ్యర్థుల అర్హతల మేరకు కంపెనీలు తమ తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు పదవ తరగతి, బీటెక్, ఎంబీఏ, B.Sc, MSc, ఆర్గానిక్ కెమిస్ట్రీ వంటి ఏదైనా డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు వారి వారి ఉద్యోగ అర్హతల మేరకు వార్షిక జీతం 3 లక్షల వరకు ఉండనుంది. ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని, కేవలం ఫార్మల్ డ్రెస్ లో మాత్రమే హాజరుకావాలని అధికారులు సూచించారు. ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం https://naipunyam.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9705998056, 868865165 నంబర్లను సంప్రదించాలని కోరారు.