MECL Recruitment : మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 3 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.

Mineral Exploration Corporation
MECL Recruitment : మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఈసీఎల్) నాగపూర్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 53 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
READ ALSO : Green Gram Dal : గుండె ఆరోగ్యానికి మేలు చేసే పెసరపప్పు !
పోస్టుల వివరాలకు సంబంధించి అకౌంటెంట్ 06 పోస్టులు, హిందీ ట్రాన్స్‌లేటర్ 01 పోస్టులు,టెక్నీషియన్ (సర్వే & డ్రాఫ్ట్స్‌మ్యాన్) 06 పోస్టులు, అసిస్టెంట్ (శాంప్లింగ్) 10 పోస్టులు,ఎలక్ట్రీషియన్ (ల్యాబొరేటరీ) 05 పోస్టులు, ఎలక్ట్రీషియన్ (ల్యాబొరేటరీ) 05 పోస్టులు, అసిస్టెంట్ (మెటీరియల్స్) 05 పోస్టులు,అసిస్టెంట్ (అకౌంట్స్) 04 పోస్టులు,అసిస్టెంట్ (హెచ్‌ఆర్) 07 పోస్టులు,అసిస్టెంట్ (హిందీ) 01 పోస్టులు,ఎలక్ట్రీషియన్ 04 పోస్టులు ఉన్నాయి.
READ ALSO : Papaya Varieties : మేలైన బొప్పాయి రకాలు.. సాగు యాజమాన్యం
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 3 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20200-రూ.55900 చెల్లిస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
READ ALSO : Paddy Farming : వరినాట్లు వేసేటప్పుడు పాటించాల్సిన సూచనలు
అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది 13.09.2023.గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.mecl.co.in/ పరిశీలించగలరు.