AP Polycet 2025 Results: ఏపీ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి…

120కి 120 మార్కులు సాధించిన 19 మంది విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శన నిజంగా ఆకట్టుకుందన్నారు.

AP Polycet 2025 Results: ఏపీ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి…

Updated On : May 14, 2025 / 6:57 PM IST

AP Polycet 2025 Results: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్ 2025(POLYCET 2025) (ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. విద్యార్థులు అఫీషియల్ వెబ్ సైట్ polycetap.nic.in లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. WhatsAPP (మన మిత్ర): 9552300009 కు “hi” అని ఎస్ఎంఎస్ చేయడం ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష జరిగింది. 1,39,840 మంది పరీక్ష రాయగా 1,33,358 మంది పాసయ్యారు. 95.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఫలితాలపై మంత్రి లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో మహిళా సాంకేతిక నిపుణులను చూడాలనే ఆశను రేకెత్తిస్తూ, బాలికలు 96.9% మంది ఉత్తీర్ణత సాధించటం సంతోషం అన్నారు మంత్రి లోకేశ్. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Also Read: PF ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. రిటైర్మెంట్ తర్వాత మీకు ఎంత పెన్షన్ వస్తుందంటే? ఫుల్ డిటెయిల్స్..!

ASR జిల్లా(అల్లూరి సీతారామరాజు) సాంకేతిక ప్రపంచంలోకి దూసుకెళ్లాలనే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ 98.66% అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసిందన్నారు. 120కి 120 మార్కులు సాధించిన 19 మంది విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శన నిజంగా ఆకట్టుకుందన్నారు. వారి అద్భుతమైన అంకితభావాన్ని అభినందించారు. ఈ సంవత్సరం రాణించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందొద్దని మంత్రి లోకేశ్ చెప్పారు.

ఏపీ పాలిసెట్.. స్టేట్ లెవెల్ ఎగ్జామ్.. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్ పెడతారు.