NEET MDS 2025 Date : నీట్ ఎండీఎస్ 2025 ఎగ్జామ్ ఫుల్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాల కోసం..!
NEET MDS 2025 Date : అధికారిక షెడ్యూల్ ప్రకారం.. మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ కోర్సు 2025 లేదా నీట్ ఎండీఎస్ 2025 కోసం నీట్ పీజీ వచ్చే జనవరి 31న నిర్వహించనున్నారు.

NEET MDS 2025 Date
NEET MDS 2025 Date : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ (NBEMS), నీట్ ఎండీఎస్ 2025 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ కోర్సు 2025 లేదా నీట్ ఎండీఎస్ 2025 కోసం నీట్ పీజీ వచ్చే జనవరి 31న నిర్వహించనున్నారు.
ఎన్‌బీఈఎమ్ఎస్ త్వరలో నీట్ ఎండీఎస్ 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ (natboard.edu.in)లో విడుదల చేస్తుంది. అభ్యర్థులు ఎన్‌బిఇఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షకు సంబంధించిన సమాచార బులెటిన్‌లు, దరఖాస్తు ఫారమ్‌లు, ఇతర వివరాలను పొందవచ్చు. నీట్-ఎండీఎస్ అనేది వివిధ ఎండీఎస్ కోర్సులలో ప్రవేశానికి అర్హత-కమ్-ర్యాంకింగ్ పరీక్షగా చెప్పవచ్చు.
- భారత్‌లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆల్ ఇండియా 50శాతం కోటా ఎండీఎస్ సీట్లు.
- భారత్‌లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్ర కోటా సీట్లు.
- దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ డెంటల్ కాలేజీలు, ఇన్‌స్టిట్యూషన్‌లు, యూనివర్సిటీలలో ఎండీఎస్ కోర్సులు
- ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎండీఎస్ కోర్సులు.
- ఆర్మీ డెంటల్ కార్ప్స్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం డెంటల్ సర్జన్స్ (BDS & MDS) కోసం స్క్రీనింగ్ పరీక్ష
నీట్ ఎండీఎస్ 2025: అర్హత ప్రమాణాలు :
మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థి, భారత్‌లోని యూనివర్శిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ ద్వారా గుర్తింపు పొందిన బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ డిగ్రీని కలిగి ఉండాలి. స్టేట్ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసి, తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ పొంది, తప్పనిసరి రొటేటరీ ఇంటర్న్‌షిప్ పొంది ఉండాలి. ఆమోదించిన/గుర్తింపు పొందిన డెంటల్ కాలేజీలో ఒక ఏడాది వరకు చదివి ఉండాలి.
Read Also : TSPSC Group 3 Exam : త్వరలో తెలంగాణ గ్రూపు 3 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల.. ఎలా చెక్ చేయాలంటే?