కొత్త BC గురుకులాల్లో 5, 6 క్లాసులు

  • Published By: madhu ,Published On : March 29, 2019 / 01:46 AM IST
కొత్త BC గురుకులాల్లో 5, 6 క్లాసులు

Updated On : March 29, 2019 / 1:46 AM IST

రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ గురుకులాలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరానికి 5, 6 తరగతులు నిర్వహించాలని బీసీ గురుకుల సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి తరగతిలో రెండు సెక్షన్ల కింద 40 మంది విద్యార్థులను చేరిపించుకోనున్నారు. ఈ మేరకు బీసీ గురుకుల సొసైటీ కసరత్తు చేస్తోంది. 2019 -20 విద్యా సంవత్సరం నుండి తరగతులను ప్రారంభించేందుకు అధికారులు భవనాల కోసం తిరుగుతున్నారు. కనీసం 400 మంది స్టూడెంట్స్ చదుకోవడానికి, వీరు ఆడుకోవడానికి..చదువుకోవడానికి అనువైన భవనాలను కిరాయికి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అయితే బిల్డింగ్స్ దొరకపోతుండడం వారికి పెద్ద సమస్యగా మారింది. భవనాలు అందుబాటులో లేకపోతే ప్రస్తుత గురుకుల భవనాల్లో తాత్కాలికంగా సర్దుబాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు కొత్తగా మంజూరైన గురుకులాల్లో బోధనా సిబ్బంది నియామకం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక ఉపాధ్యాయులే పాఠాలు చెప్పాలని అధికారులు సూచించారు. నూతన జోనల్ విధానం కింద పోస్టులను విభజించాల్సి ఉంది. ఇది చేయడానికి కొంత టైం పట్టనుంది. అప్పటి వరకు తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించనుంది.